Thursday, April 9, 2015

ప్రేమ చాలా మధురం’ అంటారు:త్రిష

ప్రేమ చాలా మధురం’ అంటారు:త్రిష

‘ప్రేమ లేదనీ....ప్రేమించరాదనీ ’’ అని మహాకవి ఆత్రేయ ‘అభినందన’ చిత్రంలో ప్రేమ గురించి తనదైన శైలిలో రాశారు. మళ్లీ అదే సినిమాలో ‘‘ప్రేమ ఎంత మధురం...ప్రియురాలు అంత కఠినం’’ అన్నారు. ఇలా ప్రేమ గురించి మంచీ, చెడూ ఏది చెప్పినా వినడానికి మాత్రం హాయిగా ఉంటుంది. ప్రేమకు ఉన్న మహత్తు అలాంటిది. అసలు ఈ ప్రపంచంలో ప్రేమ గురించి మాట్లాడనివాళ్లు ఎవరూ ఉండరేమో! ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో రకంగా విశ్లేషిస్తారు. పెళ్లిలో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్న త్రిష మాత్రం... ‘ప్రేమ చాలా మధురం’ అంటారు. ప్రేమ గురించి ట్విట్టర్‌లో త్రిష స్పందిస్తూ -‘‘ప్రేమలో అసూయ, ద్వేషం, విషాదం, ఒంటరితనం, ఎడబాటు, సంతోషం - అన్నీ ఉంటాయి. ఈ బంధంలో ఉన్నప్పుడు బాధ, సంతోషం ఏదైనాసరే దానికి కారణం ప్రేమే అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. ప్రేమ ఎప్పుడూ బాధపెట్టదు. వాస్తవానికి ప్రేమ ఎన్నడూ ఎవర్నీ బాధపెట్టదు. మనసుకైన గాయాలు మానడానికి ప్రేమ కన్నా మించిన మంచి మందు లేదు. ఈ ప్రపంచంలో ఉన్న బాధలన్నింటినీ పోగొట్టే శక్తి ప్రేమకు ఉంది. బాధ నుంచి బయటపడేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చే అద్భుతమైన ఆయుధం ప్రేమ’’ అన్నారు.

No comments:

Post a Comment