Thursday, April 9, 2015

చంద్రబాబు..మహానాడు

మహానాడును టార్గెట్ చేసుకుని నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఆ లోపు జిల్లాలో ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను పార్టీకోసం పనిచేసే కీలకమైన నాయకులు, కార్యకర్తలతో భర్తీ చేయాలని భావిస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా మంత్రులు, నియోజకవర్గ ఎమ్మెల్యేలను నామినేటెడ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. మొన్నటి వరకు తరువాత చూద్దామన్న ఆలోచనతో ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాలో 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ విజయం సాధించింది. వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం నామినేటెడ్ పదవులన్నీ రద్దుచేసింది. అప్పటి నుండి ఒక్కొక్కటిగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసుకుంటూ వస్తోంది. వీటిలో ముఖ్యమైనవి మార్కెట్ యార్డులు. జిల్లాలో కేవలం కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలకు మాత్రమే నూతన కార్యవర్గాలను ఏర్పాటుచేశారు. ఇంకా చాలావరకు మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే పార్టీ నేతలు, ఎమ్మెల్యేల మధ్య భేదాభిప్రాయాలు ఉండటంతో వాటి భర్తీకి వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఇంచుమించుగా ఎమ్మెల్యే స్థాయి పదవి. ఒక విధంగా షాడో ఎమ్మెల్యేగా మార్కెట్ యార్డు చైర్మన్‌ని పిలుస్తారు. ఇలా నియోజకవర్గాల్లో చాలావరకు మార్కెట్ యార్డులతో పాటు చాలా నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు ఎమ్మెల్యేలు ముందుకు రావడం లేదు. ఇక మే 27, 28, 29 తేదీల్లో విజయవాడలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఇప్పటికే పార్టీ ఆ పనుల్లో నిమగ్నమై ఉంది. మరోపక్క సంస్థాగత ఎన్నికలను కూడా పూర్తిచేసుకోనుంది. పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేసినట్టైతే ఒక విధంగా మహానాడును విజయవంతం చేసినట్టే. తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చిన జిల్లాలో పార్టీ, ఎమ్మెల్యేల మధ్య సమన్వయ లోపం కారణంగా నామినేటెడ్ 

No comments:

Post a Comment