Monday, April 6, 2015

‘మా’ నటీనటులార ఆదరించండి



ఇంతకీ ఆ నటుడు ఎవరంటారా? అతను 70 వ దశకంలోనే చెన్నై రైలు ఎక్కి చేతకాదు అనుకున్న దానిని ప్రయత్నం చేసి ఆనాటి దర్శకుల సహాయంతో తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రెండున్నర అడుగుల కళాకారుడు. అతనెవరో ఇప్పటికే దాదాపు మీకర్ధం అయివుంటుంది. అతనే మన పొట్టి వీరయ్య మరగుజ్జు తనం శాపంగా బావించి భయంతో భాధతో బ్రతుకుతున్న ఆ రోజులలోనే ధైర్యం చేసి అతని ఆకారాన్ని అవకాశంగా వాడుకోవాలని సూర్యాపేట నుండి చెన్నై రైలు ఎక్కి సినీ అవకాశాలు సంపాదించి సినీ అభిమానుల మనసులలో ముద్ర వేసుకున్నాడు. ఆరోజుల్లో విటాలాచార్య, దాసరి నారాయణరావు వంటి తదితర దర్శకులు వీరయ్య కోసం పాత్రలు సృష్టించి అవకాశాలు కల్పించి ప్రోత్సహించారు. తరువాత తరువాత ఫిలిం ఇండస్ట్రీ హైదరబాద్ షిఫ్ట్ అయ్యాక తాను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు కాని తరువాత తరం దర్శకులు మాత్రం వీరయ్యకి కోసం పెద్దగా అవకాశాలు కల్పించలేదు. రోజులు గడుస్తున్న కొద్ది పొట్ట గడుపుకోవటం కష్టం అయ్యింది. దిక్కు తోచని స్దితిలో కృష్ణ నగర్ లో కాయిన్ బాక్స్ డబ్బా పెట్టుకొని కాలం వెళ్ళదీస్తూ వచ్చాడు. అయితే టెక్నాలజీ పెరిగి అందరి చేతుల్లోకి సెల్ పోన్ లు వచ్చిన తరువాత కాయిన్ ఫోన్ కాలం చెల్లింది. పాపం వీరయ్యకి ఆ ఆదాయం కూడా లేకుండా పొయింది. అడపాదడపా చిన్న చితక వేషాలు నెలకో రెండు నెలలకో ఓ రోజు పడితే అదే మహాభాగ్యం. అందులో జీవితం దుర్బరంగా ఉంది. అయినా వీరయ్య ఎప్పుడు లైమ్ లైట్ లోనే ఉంటాడు ఎలా అంటారా? మీడియా, సినీరాజకీయ నాయకులు పేద కళాకారుడు అన్న పేరు చెప్పాలంటే చాలు ముందు వీరయ్య గురించే చెప్తారు. ఓ సినీయర్ సెటిల్ అయిన నటుడు ఓ పేద కలాకారుడితో ఫోటో దిగి రాజకీయం చేయాలంటే వీరయ్య కన్పిస్తాడు ఏంటో వాళ్ళ స్వార్ధానికి తన పేదరికాన్ని ఉపయోగించుకునే ఈ సినీరాజకీయ పండితులు తనకి నాలుగు అవకాశాలు కల్పించటానికి కాని ఏదైనా ఆర్ధిక సహాయం చేయటానికి కాని ముందుకు రారు. ఏ సంత్సరానికో రెండు సంత్సరాలకో ఎవరైనా దాత వచ్చి ఓ ఐదు వేలో పదివేలో ఇస్తే అవి ఎన్ని రోజులు సరిపోతాయి. దర్శక నిర్మతలారా...! ‘మా’ నటీనటులార ఒక్కసారి మీతోటి నటుడి గురించి ఆలోచించండి ఆదరించండి.

No comments:

Post a Comment