Wednesday, April 8, 2015

153 లొకేషన్లలో 'సన్నాఫ్ సత్యమూర్తి'


అల్లు అర్జున్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంపై ప్రేక్షకులు, మెగా అభిమానులలో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ప్రతి ఏరియాలో భారి ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యు.ఎస్.ఏ.లో ఫస్ట్ డే మొత్తం 153 లొకేషన్లలో 'సన్నాఫ్ సత్యమూర్తి' విడుదలవుతుంది. ప్రస్తుతానికి కన్ఫర్మ్ అయిన థియేటర్ల సంఖ్య ఇది. రెండు మూడు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఓవర్సీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో 'సన్నాఫ్ సత్యమూర్తి' రికార్డు సృష్టించడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాలో దర్శకుడు త్రివిక్రమ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది చిత్రాలు కాసుల కనక వర్షం కురిపించాయి. 'సన్నాఫ్ సత్యమూర్తి' ఎంత వసూలు చేస్తుందో..? అని అంతా ఎదురుచూస్తున్నారు. అమెరికాలో అత్యధిక లొకేషన్లలో(159) విడుదలైన చిత్రంగా మహేష్ 'ఆగడు' రికార్డు నెలకొల్పింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కూడా 'ఆగడు'పై ఉంది. వీటిని 'సన్నాఫ్ సత్యమూర్తి' బ్రేక్ చేస్తుందో..? లేదో..? చూడాలి.

No comments:

Post a Comment