Wednesday, April 8, 2015

ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథతో పరేష్ రావల్ చిత్రం


ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథతో బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. విలక్షణ నటడు పరేష్ రావల్ మోదీ పాత్రలో కనిపించనున్నారు. ఆ సినిమా ఆగస్టులో సెట్స్పైకి వెళ్లనుంది. ఓ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పరేష్ రావల్ ఈ విషయం తెలిపారు.''మోదీ సంకల్ప బలం, దార్శనికత, నాయకత్వ లక్షణాలను నా పాత్రలో ప్రతిబింబిస్తా. అంతే తప్ప మోదీని ఏ మాత్రం అనుకరించే ప్రయత్నం చేయను'' అని చెప్పారు పరేష్. గతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్గా పరేష్ ఓ సినిమాలో కనిపించారు.ప్రస్తుతం ఎంపీగా ఉన్న పరేష్ పార్లమెంటు అనుభవం గురించీ మాట్లాడారు. ''సభలో జరిగే చర్చలు నాకు ఎంతో ఉపకరిస్తున్నాయి. వాటి వల్ల ఓ పౌరుడిగానే కాక నటుడిగానూ నన్ను నేను మెరుగుపర్చుకోగలుగుతున్నాను'' అని చెప్పారు పరేష్ రావల్.
NaN

No comments:

Post a Comment