Wednesday, April 8, 2015

వీరు కత్తి ఎప్పుడు దూస్తారో....

వీరు కత్తి ఎప్పుడు దూస్తారో....
ఈ మధ్య తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు మంచి ఊపందుకున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్ లో మల్టీస్టారర్స్ సినిమాలు కామన్. ఎంత పెద్ద హీరోలు అయినా ఏమాత్రం ఇగోలకు స్థానం ఇవ్వకుండా నటిస్తారు. మరి తెలుగు సినిమాలో కూడా మల్టీస్టారర్స్ సినిమాలు చాలా తక్కువ ఎందుకంటే ఇక్కడ ఎవరి ఇమేజ్ వారిదే.. కానీ ఈ మధ్య కాలంలో ఇగోలు అన్నీ పక్కకు పెట్టి ఈ టైప్ ఆఫ్ సినిమాలకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తున్నారు. మొన్నామధ్య వచ్చిన గోపాల గోపాల ఎంతటి ఘనవిజయం సాధించిందో వేరే చెప్పనక్కరలేదు. తాజాగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన కత్తి సినిమా కోలీవుడ్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. విజయ్ , మోహన్ లాల్ కలసి నటించిన ఈ సినిమాని తెలుగులోనూ రిమేక్ చేస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఠాగూర్ మధు ఈ సినిమా రీమేక్ హక్కులని దక్కించుకున్నారు. నేటి సమాజంలో జరగుతున్న అన్యాయాలు, అక్రమాలపై, బడుగు బలహీనవర్గాలు , రాజకీయాల నేపధ్యంలో రూపొందిన సినిమా ఇది. మరి తెలుగులో అంత పవర్ ఫుల్ కాంబినేషన్ ఏదా అని అలోచిస్తే గోపాల గోపాల లో ఇద్దరు హీరోల్లో పవన్ కళ్యాన్, టెంపర్ సినిమాతో దుమ్ము లేపిన ఎన్టీఆర్ కరెక్ట్ అని అనిపించందట. ఇక్కడి వరకు బాగుంది కానీ ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం బిజీ షెడ్యూల్లో ఉన్నారు. పవన్, ఎన్టీఆర్ లకు ఈ సినిమా తెగ నచ్చిందట. అందులో పాత్రలు కూడా బాగా నచ్చాయట. ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 కోసం , దాసరి సినిమాకోసం సిద్దంగా ఉన్నాడు. మరి వీరీ కత్తి ఎప్పుడు దూస్తారో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

No comments:

Post a Comment