Tuesday, April 7, 2015

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు.ఎంత సంపాదించినా ఆరోగ్యం సహకరించకుంటే అదంతా వేస్టే. ఆరోగ్యానికున్న ప్రాధాన్యత అలాంటిది. ఇవాళ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం...1948 ఏప్రిల్ ఏడో తేదిన మొదటిసారి ప్రపంచ ఆరోగ్య సమావేశాన్ని WHO నిర్వహించారు. అయితే 1950 నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ రోజున వరల్డ్ హెల్త్ సమావేశాన్ని జరుపుతున్నారు. ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు, రక్షిత మంచినీటి సప్లయ్, అత్యవసర సమయాల్లో ఆరోగ్యకరమైన అంశాలపై సమన్వయం, వాతావరణంలో వచ్చే మార్పులను అధిగమించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపునిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సంస్థ అనారోగ్యానికి దారి తీసే ప్రధాన అంశం మీద పరిశోధించి అంతర్జాతీయ, దేశీయ, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలలో నిర్ణీత ప్రాంతాలలో ఏఫ్రిల్ 7వ తేదీన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి రోజు నిద్ర లేచినదగ్గర నుంచి ఉరుకులు పరుగులమయంతో కూడుకున్న ఈ జీవితంలో ఆరోగ్యం గురించి పట్టించుకునే తీరిక నేటి ప్రజలకు కొరవడింది. ఆకలేస్తుంది కదా అని ఏది పడితే అది తినేస్తున్నారా? ధర తక్కువని, లేక ఎక్కువ ఆహారం, ఎక్కువ వెరైటీలు వచ్చేస్తున్నాయని నాన్ స్టాప్ గా లాగించేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. కలుషిత ఆహారం కాటేసే ప్రమాదం ఉంది. అవును నాణ్యత లేని ఆహారం ప్రపంచాన్నే పట్టి పీడిస్తుంది. కలుషిత ఆహారం ఏటా 20 లక్షల మంది ప్రాణాలను హరిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నిజం. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సురక్షిత ఆహారానికి 5 సూచనలు చేసింది. ఏప్రిల్ 7వ తేదీ అంటే ఈరోజే. ఈరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏటా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్నిఒక్కో థీమ్ తో జరుపుకుంటారు. 1948 నుంచి ఈ దినోత్సవం రోజున ఏటా ఓ నినాదాన్ని ఎంపిక చేసుకుని ఆయా రోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇలా తొలిసారి అంటు వ్యాధులు అన్న అంశాన్ని నినాదంగా తీసుకోగా, 1972లో అనేక మంది చిన్నారులు టీబీతో మృతి చెందగా, ఆ ఏడాది టీబీకి వ్యతిరేకంగా అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు . 2011లోఅధిక మందుల వాడకం- కలిగే అనర్ధాలు అన్న అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని విస్తృత ప్రచారం కల్పించగా, 2012లో ఏజింగ్ హెల్త్ – గుడ్ హెల్త్ యాడ్స్ లైఫ్ టు ఇయర్స్ ను థీంగా తీసుకుంది. 2014లో వెక్టర్ బోన్ డిజీస్ నినాదం తీసుకుంది. ఈసారి ప్రమ్ ఫామ్ టు ప్లేట్, మేక్ పుడ్ సేఫ్. వ్యవసాయ క్షేత్రం నుంచి ప్లేట్ లోకి సురక్షిత ఆహార తయారి అనే ఈ రెండు అంశాలు ఈ సారి ప్రధానాంశాలు. కలుషిత ఆహారం తినడం వల్లే అనేక వ్యాధుల బారిన పడడం కాకుండా ఒక్కోసారి ప్రాణాలు కూడా పోవచ్చు. వాతావరణంలో వస్తున్న మార్పులు సైతం మనం తినే ఆహార పదార్థాలపై ప్రభావం చూపుతాయి. ;వినియోగ పద్దతులు కూడా మారుతున్నాయి. గ్లోబలైజేషన్ అవుతున్న నేటికాలంలో పరిశుభ్రమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అందుకే సురక్షితమైన ఆహార వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. రైతులు లేదా ఆహార ఉత్పత్తి దారులు వీటిని వినియోగించే వారు ఎలాంటి సూచనలు తీసుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ;కీలక సూచనలు చేసింది.
 

No comments:

Post a Comment