కరివేపాకు కదా అని తీసి పారేయకండి. ఉపయోగాలు ఎన్నో…
రక్తహీనత, మధుమేహం, జీర్ణసంబంధమైన సమస్యలను నివారించడంలో కరివేపాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా ఉన్నందున వంటల్లో దీన్ని విరివిగా వాడుతుండాలి. కరివేపాకులోని విటమిన్-ఎ వల్ల దృష్టి సంబంధ లోపాలను (కాటరాక్ట్) అధిగమించవచ్చు. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉన్నందున రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. జీర్ణశక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. మధుమేహాన్ని తగ్గించే గుణం ఉన్నందున బ్లడ్ సుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు బాక్టీరియాను నివారించే అంశాలున్నందున కరివేపాకును వాడితే చర్మసంబంధ ఇన్‌ఫెక్షన్లకు దూరం కావొచ్చు. జట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలను అధిగమించేందుకు కరివేపాకును విరివిగా వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment