Friday, May 15, 2015

మోదీ చైనా పర్యటనలో బిజీగా


ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో బిజీగా ఉన్నారు. అయితే..ఆయన అక్కడ ఉండగానే..జియాన్ సిటీలో..చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్‌‌తో చర్చలు జరుపుతుండగానే అక్కడి ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీవీలో భారత్‌‌కు సంబంధించి ఓ మ్యాప్ చూపారు. అందులో జమ్మూ కాశ్మీర్ గానీ, అరుణాచల్‌ప్రదేశ్ గానీ కనిపిస్తే ఒట్టు. ఆ రెండూ లేకుండానే మ్యాప్ ప్రదర్శించారు. మోదీ పర్యటనకు సంబంధించి ఆ టీవీ రిపోర్టింగ్ చేస్తున్న సందర్భంగా ఈ ఉదంతం చోటు చేసుకుంది. అరుణాచల్ తమదేనని, అది తమ దేశంలో అంతర్భాగమేనని, అలాగే జమ్మూ కాశ్మీర్‌‌లో కొన్నిభాగాలు కూడా తమవేనని చైనా వాదిస్తోంది. కానీ భారత్ ఈ వాదనను తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సరిహద్దు సమస్య భారత, చైనాల మధ్య ఎడతెగని పీటముడిగా మారింది. ఇప్పటివరకు దీనిపై ప్రతినిధుల స్థాయిలో 18 సార్లు చర్చలు జరిగాయి. మరి మ్యాప్‌‌లో అరుణాచల్, జమ్మూ కాశ్మీర్ లేని అంశంపై మోదీ చైనా నేతలతో చర్చిస్తారా లేక చూసీ చూడనట్టు వ్యవహరిస్తారా అన్నది తేలాల్సి ఉంది

No comments:

Post a Comment