టాలీవుడ్ లో ఇప్పుడు అందరి కళ్లు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంపైనే. పూరీ దర్శకత్వంలో వచ్చే సినిమా అంటేనే హిట్టే అని ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారు. అయితే ఇంతకీ చిరంజీవి సినిమా స్టోరీ ఏంటి ? అది మాస్... క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? అనే ప్రశ్నలు ఇప్పటికే ఆయన అభిమానులు మనస్సులను తొలి చేస్తున్నాయి. అలాగే చిరంజీవి సరసన నటించే హీరోయన్ మాత్రం ఎవరనేది అభిమానులకు తెలియక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ సినిమాలో టాలీవుడా లేక బాలీవుడ్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారా? అని ఎవరికీ వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే చిరంజీవి 150వ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ నయనతార కొట్టేసిందంటూ టాలీవుడ్ లో ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే ఈ వార్తలను పూరీ సన్నిహితులు మాత్రం కొట్టిపారేశారు. అవన్ని ఒట్టి పుకార్లే అని వారు పేర్కొన్నారు. ఆ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం ఇంతవరకూ నయనతారతోనే కలసి చర్చించనే లేదని వారు స్పష్టం చేశారు. చిరంజీవి చిత్ర కథపై దర్శకుడు పూరీ గట్టిగా కసరత్తు చేస్తున్నాడని... కథను రూపొందించడంలో నిమగ్నమైన పూరీ ఇంకా చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదని సన్నిహితుల భోగట్టా. దాంతో చిరంజీవి సినిమాలో హీరోయిన్ నయన తార కాకుంటే ఇంకా ఎవరబ్బా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
No comments:
Post a Comment