మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ పతాకంపై వై.నవీన్, రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్ ప్రచారంలో వుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మగాడు అనే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్ర బృందం వున్నట్లు తెలిసింది. షూటింగ్ ఆరంభం నుంచి ఈ చిత్రానికి శ్రీమంతుడు అనే టైటిల్‌తో మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా టైటిల్ మార్పునకు చిత్ర వర్గాలు సిద్ధపడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చిత్ర టైటిల్ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. కుటుంబ అనుబంధాలు, సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మహేష్‌బాబు పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని, యాక్షన్‌కు కూడా ప్రాధాన్యత వుందని చిత్ర బృందం చెబుతోంది. ఇందులో పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. రాజేంద్రప్రసాద్, సుకన్య, ఆమని, సంపత్‌రాజ్, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
No comments:
Post a Comment