Saturday, May 16, 2015

మొబైల్ బ్యాంకింగ్ జాగ్రత్తలు పాటిస్తున్నారా


అందుబాటులోకొచ్చిన సాంకేతిక పరిజ్ఞానం బ్యాంకు సేవలు, వివిధ బిల్లుల చెల్లింపుల్ని కూడా మరింత సులభతరం చేసింది. అందుకే ఇప్పుడు చాలామంది స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ మొబైల్ నుంచే అన్ని ట్రాన్సాక్షన్లు జరిపేస్తున్నారు. అయితే అలా తమ స్మార్ట్‌ఫోన్‌తో మొబైల్ బ్యాంకింగ్ చేసే వాళ్లంతా తగిన జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటే మంచిదంటున్నారు సైబర్ ఎక్స్‌పర్ట్స్. లేదంటే మీ జేబుకు చిల్లు పడటం ఖాయం అని హెచ్చరిస్తున్నారు. అందులో నిపుణులు సూచిస్తున్న కొన్ని ఇంపార్టంట్ టిప్స్ ఇలా వున్నాయి. ఈమధ్య కొన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు వారి సోషల్ మీడియా కాంటాక్ట్సులో వుండేవారికి కూడా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు వీలు కల్పించాయి. ఇటీవలే పింగ్‌పే పేరిట యాక్సిస్ బ్యాంక్ ఓ అప్లికేషన్‌ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్, ఎస్ఎంఎస్, ఈమెయిల్... వీటన్నింటిలో వున్న కాంటాక్ట్సులో ఎవరికైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుంటుంది. సరిగ్గా ఇదే తరహాలో కోటక్ మహీంద్రా కూడా కేపే, పాకెట్స్ యాప్స్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ సేవలందిస్తోంది. అయితే ఇటువంటి యాప్స్ వాడకం విషయంలో కస్టమర్లు తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటూ ఈమధ్యే హెచ్చరికలు జారీచేసింది ఆర్బీఐ. ఏప్రిల్‌లో విడుదలైన ఓ యాప్‌ని దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈ హెచ్చరికలు చేసింది. మీ అన్ని బ్యాంకుల ఎకౌంట్లలోని బ్యాలెన్స్‌ని చెక్ చేసుకోవచ్చునంటూ ఆర్బీఐ లోగోతో కూడిన ఓ యాప్ ఏప్రిల్‌లో మార్కెట్‌లోకొచ్చింది. అయితే దీనికీ, తమకు ఏ విధమైన సంబంధం లేదని... దాని వాడకం ద్వారా తలెత్తే సమస్యలకు ఆర్బీఐ బాధ్యత వహించబోదంటూ ఈ హెచ్చరికల్లో పేర్కొంది ఆ సంస్థ. అచ్చం ఒరిజినల్ బ్యాంక్ యాప్స్‌లాగే కనిపిస్తున్న కొన్ని ఫేక్ మాల్‌వేర్ యాప్స్ కూడా ఇంటర్నెట్‌లో అందుబాటులో వున్నాయని, అవి డౌన్‌లోడ్ చేసి వాడితే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదంటోంది ఆర్బీఐ. వివిధ బ్యాంకులు అందిస్తున్న ఒరిజినల్ జెన్యూన్ యాప్స్‌ని వాడితే పర్వాలేదు కానీ ఏదీపడితే అది మాత్రం వాడకండని అప్రమత్తం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. విశ్వసనీయతలేని ఫేక్ యాప్స్‌ని వాడటం వల్ల మీ ఎకౌంట్ యూజర్ ఐడీ, లాగిన్ ఐడీ, పర్సనల్ డీటేల్స్ హ్యాకర్స్‌కి తెలిసిపోవడంతోపాటు మీ సొమ్ము చోరికి గురయ్యే ప్రమాదం వుందని అలెర్ట్ చేస్తున్నారు బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న సెక్యురిటీ వింగ్ సైబర్ ఎక్స్‌పర్ట్స్.

No comments:

Post a Comment